సీఎం పర్యటన వివరాలివే

సీఎం పర్యటన వివరాలివే

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ లో ఆదివారం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4.30 కి నిర్మల్ చేరుకుంటారు 4.40 కి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 5.05 గంటలకు సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకుంటారు.

కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం 6.30 కి క్రషర్ రోడ్డు లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 7.30 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళతారు. ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 2500 పోలీసు సిబ్బందిని నియమించారు. ఇందులో భాగంగా నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ను మరో మార్గం వైపు మళ్ళిస్తున్నారు.