గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి...

గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో గుండెపోటుతో 104 డ్రైవర్ రాజుకుమార్ మృతి చెందాడు. రాజుకుమార్  104లో విధులు నిర్వహిస్తూనే రాజకుమార్ అస్వస్థతకు గురైయ్యాడు గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  గత కొన్ని రోజులుగా రాజుకుమార్ డిఎంహెచ్ ఓ  ఆఫీస్ లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు. గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో మనస్థాపానికి గురైనట్లు తెలిపిన తోటి సిబ్బంది తెలిపారు. డిఎంహెచ్ ఓ  పుప్పాల శ్రీధర్ అదనపు డ్యూటీ చేయుమని ఒత్తిడి చేయడంతో రెండు రోజులుగా డ్యూటీ చేస్తున్నాడని, రాజకుమార్ మృతి కి డిఎంహెచ్ ఓ  నే కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.