ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ 

ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో పోలీసు మోటార్ ట్రాన్స్ పోర్టు కి సంబంధించిన ఫ్లీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ ఎం ఎస్ ) నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ నవీన్ ఎంటిఓ  రైటర్ కానిస్టేబుల్  కే. సత్యనారాయణలకు  డిజిపి  కమెండేషన్ లెటర్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  ఎస్పీ  ఎగ్గడి భాస్కర్  అభినందించి సదరు కమెండేషన్ సర్టిఫికెట్ ను వారికి అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని రివార్డులు, అవార్డులు సాధించాలని సమర్థవంతమైన సేవలు ద్వారా పోలీసులకు గుర్తింపు లభిస్తుందని ఈ సందర్బంగా ఎస్పీ పేర్కొన్నారు.