వెల్గటూర్ నోట్ల కట్టల కలకలం

వెల్గటూర్ నోట్ల కట్టల కలకలం
  • వెల్గటూర్ -జగిత్యాల రహదారి పై డబ్బులు ప్రత్యక్షం
  • దొంగ నోట్లు కావచ్చని స్థానికుల ఆందోళన

వెల్గటూర్, ముద్ర :  జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండల కేంద్రం లో వెల్గటూర్- జగిత్యాల రహదారి పై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నోట్ల కట్టలను విసురుతూ వెళ్లినట్లు వెల్గటూర్ లో  చర్చ జోరుగా జరుగుతుంది.  ఈ మేరకు రహదారి పక్కన పడి ఉన్న నోట్లోను ఆ రహదారి గుండా వెళ్తున్నటువంటి బాటసారులు,స్థానికులు కొందరు  తీసుకున్నట్లు సమాచారం. కాగా మొదట ఆ నోట్లను చూసిన కొందరు వ్యక్తులు అవి దొంగ నోట్లు కావచ్చని భయభ్రాంతులకు గురైనట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో అన్ని నోట్ల కట్టలు 2000, 500 నోట్లు విసురుతూ వెళ్లిన వారెవరై ఉంటారని,అలా ఎందుకు విసిరి వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు