ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా స్మార్ట్ సిటీ పనులు- మంత్రి గంగుల కమలాకర్

ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా స్మార్ట్ సిటీ పనులు- మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగకుండా స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ చౌక్ వద్ద మేయర్ సునీల్ రావు తో కలిసి మంత్రి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో వేగం వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు.
అవసరమైతే  పోలీసుల సహకారం తీసుకోవాలని కాంట్రాక్టర్ లకు సూచించారు. పనుల్లో నాణ్యత పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మంత్రి వెంట బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.