తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి...

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి...

ముద్ర, తుర్కపల్లి :తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు తుర్కపల్లి చౌరస్తాలో ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికీ, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక నెల రోజులు దాటిన కాంట పెట్టకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని మండిపడ్డారు.

తడిసిన ధాన్యానికి ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ను చెల్లించాలని అన్నారు.సరైన సమయంలో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో,ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, ఎంపిటిసిలు పలుగుల నవీన్ కుమార్,గిద్దె కరుణాకర్ పోగుల ఆంజనేయులు, మేకల బాలకృష్ణ,భాస్కర్ నాయక్, బోయిని సత్తయ్య,గుండా ప్రభాకర్,బాలరాజ్ గౌడ్, బండారు రవి, ఎర్రల నవీన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.