మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు..

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు..

ముద్ర,సెంట్రల్ డెస్క్:-క్రికెటర్ కోహ్లీ పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టదని, ప్లే ఆఫ్ చేరితేనే టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారన్న వ్యాఖ్యలకు నిరసనగా రాయుడు కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయి.రాయుడి భార్య, కూతుళ్లపై అత్యాచారం చేస్తామని  చంపేస్తామని కోహ్లీ అభిమానులు బెదిరింపులు మొదలు పెట్టారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంబటి రాయుడిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు.ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబటి రాయుడు మిత్రుడు సామ్పాల్ ఇన్స్టా లో పోస్ట్ చేశారు.