Adilabad BRS: అదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్!
- బీఆర్ఎస్ పార్టీకి జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ రాజీనామా
- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని కలిసిన జనార్దన్
- సీఎం, మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాథోడ్ జనార్దన్
అదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా బుధవారం రాథోడ్ జనార్దన్ పార్టీని వీడారు.
ఆయనతో పాటు జైనథ్ మండల జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత వీరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.