ఆరోగ్యమే మహాభాగ్యం : డాక్టర్ గీతాంజలి.

ఆరోగ్యమే మహాభాగ్యం : డాక్టర్ గీతాంజలి.
  • పద్మపాణి సౌజన్యంతో హెల్త్ క్యాంప్.
  • నామాపూర్ సర్పంచ్ విజయ ఆధ్వర్యంలో నిర్వహణ.

ముద్ర, ముస్తాబాద్:-రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో పద్మపాణి సొసైటీ వారి సౌజన్యంతో గ్రామ సర్పంచ్ విజయరామరెడ్డి అధ్యక్షతన హెల్త్ క్యాంపు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో  గ్రామంలోని దాదాపు యాభై మంది వరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హెచ్ఐవి,ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన కల్పించారు.మనతో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అలాగే ప్రతి రోజు మనం పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎచ్ఈఓ యాదగిరి,పిఎచ్ఎం జ్యోతి,ఎంఎల్ఎచ్ ఓ రజిత,ఏ ఎన్ఎం జలెంద్ర, గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య,ఆశ వర్కర్లు నవిత, గంగ,సంధ్య అనిత పద్మపాణి సొసైటీ సూపర్వైజర్ సుదర్శన్ లింక్ వర్కర్స్ నీతు రజిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.