ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ  దహనం చేసిన బీజేపీ నాయకులు..

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ  దహనం చేసిన బీజేపీ నాయకులు..

ముద్ర,చందుర్తి:రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మండల బీజేపీ ఆధ్వర్యంలోవేములవాడ రాజన్న ఆలయ  నిధులు ఐదు కోట్ల రూపాయలు వేరే ప్రాంతానికి మళ్లించినందుకు నిరసిస్తూ బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయం చాలా శక్తి వంతమైందని, త్వరలోనే కేసీఆర్ కి అర్ధమవుతుందని, ధనిక రాష్ట్రంలో ఆలయాలకు డబ్బుల కరువు ఎందుకొచ్చిందని, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సొమ్ము దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తుందని అన్నారు. రాజన్న నిధులు వెనక్కు తెచ్చేవారకూ బీజేపీ పోరాటం ఆగదని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శి చిర్రం తిరుపతి, నాయకులు గడికొప్పుల జీవన్, అంబాల శ్రీకాంత్, బందెల వెంకటేష్, లక్కర్స్ శశి కుమార్, మార్త రాజు, తిప్పని సతీష్, మేడిశెట్టి శ్రీహరి, మెంగని శ్రీనివాస్, అత్తెన మహేందర్, మోతుకుపల్లి తిరుపతి, కసరపు గౌతమ్, లింగంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.