రాజకీయ రగడ

రాజకీయ రగడ
  • వేములవాడ లో బీఆర్ఎస్ టికెట్ వార్
  • చల్మెడ వర్సెస్ చెన్నమనేని
  • సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు కె టికెట్ కేటాయించాలి
  • వేములవాడ సంగీత నిలయంలో చెన్నమనేని వర్గీయుల మీటింగ్
  • భవిష్యత్ కార్యాచరణ పై సమాలోచన..
  • సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు ఆలోచన

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చల్మెడ వర్సెస్ చెన్నమనేనిగా బి ఆర్ ఎస్ టికెట్ ఫైట్ కొనసాగుతుంది. వేములవాడ ఎమ్మెల్యేగా ఇప్పటికే నాలుగు సార్లు గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానిక కేడర్ నుండి వ్యతిరేకత, పౌరసత్వం కేసు వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ అధినాయకత్వం పరోక్ష సపోర్టుతో చెల్మెడ ఆనందరావు వైద్య సంస్థల చైర్మన్ చెలిమెడ లక్ష్మీ నరసింహ రావు రంగంలోకి దిగడంతో వేములవాడలో రాజకీయ వాతావరణం మారిపోయింది. బి ఆర్ ఎస్ టికెట్ విషయంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు అనుకూల వాతావరణ ఏర్పడడంతో చెన్నమనేని రమేష్ బాబు వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు కూతురు గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధాన ఉత్సవానికి జర్మనీ వెళ్లడంతో సెల్ మెడవర్గం పూర్తిగా  రాజకీయంగా బలోపేతం కావడానికి పర్యటనల సంఖ్యను పెంచారు. 

చల్మెడ లక్ష్మీనరసింహారావుకే వేములవాడ విఆర్ఓ టికెట్ వస్తుందని ప్రచారం తీవ్రం కావడంతో చెన్నమనేని రమేష్ బాబు వర్గీయులు మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కలిసేందుకు వచ్చి భంగపాటు గురయ్యారు. ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుచర వర్గం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంది. ఎలాగైనా రమేష్ బాబు కె టికెట్ కేటాయించేలా బీఆర్ఎస్ అధిష్టానం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అవసరమైతే హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు కూడా వెనకాడొద్దని నిర్ణయం చేసినట్లు సమాచారం. ఆదివారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు నివాసం... సంగీత నిలయంలో సుమారు 100 మందికి పైగా ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జడ్పిటిసిలు, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లు.. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు , పలువురు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనికి నాయకుల సెల్ఫోన్ను కూడా అనుమతించకుండా బయటనే పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నాయకులతో జర్మనీ నుండి ఎమ్మెల్యే రమేష్ బాబు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉందని బిఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా వేములవాడలో టిఆర్ఎస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.