మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల దీక్షలు

మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల దీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత అప్పాల గణేష్ సంఘీభావం ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ కు, ప్రతిపాదిత 200 అడుగుల రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా వీరు దీక్ష చేపట్టారు. 

మున్సిపల్ చైర్మన్ కు చేదు అనుభవం
కాగా రైతుల దీక్షా శిబిరంలో రైతుల్ని పరామర్శించేందుకు వచ్చిన మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాస్టర్ ప్లాన్ పై అభిప్రాయాలు సేకరించి పంపించేలా మునిసిపాలిటీ లో తీర్మానం చేసి పంపిస్తామని అన్నారు. అయితే తీర్మానాలు తమకు అవసరం లేదని, రద్దు చేస్తేనే విరమిస్తామని ప్రకటించారు. నచ్చజెప్పేందుకు యత్నించగా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈశ్వర్ వెనుదిరిగారు.