ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్      

ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్      

ముద్ర ప్రతినిధి,కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలోని  ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరీక్ష కేంద్రం లోని వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు అధికారులను అడిగారు. పరీక్షలు సజావుగా నడిచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రామారెడ్డి  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.