ఆర్భాటంగా ప్రారంభమైన బీఆర్ ఎస్ ప్లీనరి -పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

ఆర్భాటంగా ప్రారంభమైన బీఆర్ ఎస్ ప్లీనరి -పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

బాన్సువాడ, ముద్ర: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని  మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశానికి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. బాన్సువాడ  శాసనసభ్యుడు, రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.

ముందుగా ప్లీనరీ హాజరు నమోదు పట్టికలో  శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సంతకం చేశారు.  వేదిక వద్ద గులాబీ జెండాను పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్థూపానికి  శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి  అధ్యక్షతన  ప్లీనరి సమావేశం ప్రారంభమైంది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల కోట్లతో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. దేశంలో రానున్న ప్రభుత్వం బి ఆర్ ఎస్ డే ననని అన్నారు. వివిధ అంశాలపై తీర్మాణాలు చేశారు.

నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల లోని గ్రామాల నుండి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిధి నుండి పెద్ద ఎత్తున BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.