కామారెడ్డి-బాన్సువాడ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ - నవోదయ పరీక్షకు ఆలస్యంగా విద్యార్థులు

కామారెడ్డి-బాన్సువాడ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ - నవోదయ పరీక్షకు ఆలస్యంగా విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి-బాన్సువాడ ప్రధాన రోడ్డు పై శనివారం ఉదయం భారీ వర్షాల కారణంగా రోడ్డు చెడిపోయి, ట్రాఫిక్ జామైంది.  శనివారం నవోదయ పరీక్ష ఉండడంతో జిల్లా కేంద్రానికి వందలాది విద్యార్థులు బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద ప్రాంతాల నుంచి వెళ్లారు. అయితే ట్రాఫిక్ జామ్ కారణంగా వారు సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరక ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డు వెడల్పు పనులు సాగుతుండగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేసారు.  దీంతో నిత్యం వందలాది వాహనాలు నడిచే ఈ రోడ్డు పై వాహనాల రాకపోక ఇబ్బందికరంగా మారింది. పెద్ద పోతాంగల్ సమీపంలో ఉన్న మత్తడి వద్ద రోడ్డును తవ్వారు. కేవలం ఒకే వాహనం వెళ్ళడానికి వీలుండడంతో మిగితా వాహనాలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. శనివారం గంట పాటు ట్రాఫిక్ జామ్ కారణంగా 10.30 గంటలకు కామారెడ్డి చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యంగా చేరుకొని పరిక్షను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు