దుబ్బాక బాలాజీ దేవాలయంలో  లక్ష పుష్పార్చన

దుబ్బాక బాలాజీ దేవాలయంలో  లక్ష పుష్పార్చన
  • పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక, ముద్ర:సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ఆదివారం రోజున లక్ష పుష్పార్చన పూజా జరిగింది.రాంపురం శ్రీ గురు మదనానంద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి  పర్యవేక్షణలో ఈ కార్యక్రమము  జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి లక్ష పుష్పాలతో వేద పండితులు, అర్చకులు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆలయానికి విచ్చేసిన మాధవానంద సరస్వతి స్వామీజీకి, ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కు ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బాలాజీ దేవాలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు చింతరాజు, కూర వేణుగోపాల్ గ్రామ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.