MLC కవిత జన్మదిన సందర్భంగా SERP ఉద్యోగ సంఘం, మహిళలచే చౌట్ పల్లి కోటిలిoగేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు..

MLC కవిత జన్మదిన సందర్భంగా SERP ఉద్యోగ సంఘం, మహిళలచే చౌట్ పల్లి కోటిలిoగేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు..

కవిత కు SERP ఉద్యోగులు, మహిళల సంపూర్ణ సంఘీభావం..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా SERP ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి మం. చౌటుపల్లి లోని ప్రఖ్యాత కోటిలింగేశ్వర స్వామి మరియు ప్రత్యంగిరా మాత ఆలయంలో SERP ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఐకెపి ఏపీఏం కుంట గంగాధర్ రెడ్డి,  మహిళా సమాఖ్య ప్రతినిధులు, సిబ్బంది వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షిత్ చేతుల మీదుగా అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 దేవుడు MLC కవిత కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రస్తుతం ఎదురైనా అవాంతరాల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల డ్వాక్రా మహిళలు, మొత్తం సెర్ప్ సిబ్బంది కవిత గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా సెర్ఫ్ ఉద్యోగుల స్టేట్ యూనియన్ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సీసీలు వర్ణం శ్రీనివాస్ , నవీన్ భాగ్యలక్ష్మి పీరియ లు, VOA లు మధురిమ, బాగ్య, వాణీ, మహిళా సమాఖ్య ప్రతినిధులు  కవిత, పుష్ప, కౌసర్ సుల్తానా, గంగమ్మ, జమున, మహిళలు పాల్గొన్నారు