స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి బి ఫామ్ అందజేసిన కేసిఆర్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి బి ఫామ్ అందజేసిన కేసిఆర్

ముద్ర, షాద్ నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఫామ్ అందజేశారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డికి బీఫామ్ అందజేసి అభినందించారు.

విజయంతో తిరిగి రావాలంటే ఆకాంక్షించారు. అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు ఉన్నారు.