ఈతకు వెళ్లి బాలుడు మృతి...

ఈతకు వెళ్లి బాలుడు మృతి...

ముద్ర,గంభీరావుపేట: స్నేహితులతో ఈత కొట్టడానికి వెళ్లిన ఓ బాలుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిని మేడ నిఖిల్(8)ఈతకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో నిఖిల్ కాలువలో  నుండి ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై మహేష్ తెలిపారు.