అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
Congress party against unannounced power cuts

ముద్ర, మహబూబ్ నగర్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ, రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అడ్డాకుల మండల కేంద్రంలోని ఏ ఈ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి , మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి (GMR) , మహబూబ్ నగర్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండా ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య కాంగ్రెస్ నాయకులు హాజరై AE కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి  మాట్లాడుతూ...రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థను సీఎం కేసీఆర్‌ భ్రష్టు పట్టించారని, బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు తెరిస్తే చాలు 24గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.యాసంగి పంటలకు విద్యుత్‌ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ధ్వజమెత్తారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జియంఆర్ గారు మాట్లాడుతూ.. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతులు పొలాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జిఎంఆర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏకధాటిగా విద్యుత్ ఇవ్వకపోవడంతో, విడతలు, విడతలుగా వచ్చే కరెంటుతో తడిసిన పొలాలే మళ్లీ తడుస్తున్నాయి తప్ప.. పంటలకు నీళ్లు అందడం లేదని జిఎంఆర్ గారు పేర్కొన్నారు.అప్రకటిత కరెంటు కోతల కారణంగా యాసంగి సీజన్ లో పొలాలు ఎండిపోతున్నాయని‌ తెలిపారు.

వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా టిఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ ప్రభుత్వం పై జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంటల త్రీ ఫేస్ కరెంట్ ఇస్తామన్న హామీ ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని రైతాంగాన్నికి విజ్ఞప్తి చేసారు ఆ నంతరం AE కార్యాలయంలో అప్రకటిత విద్యుత్ కోతలను ఆపి, తక్షణమే రైతాంగానికి 24 గంటల త్రీఫేజ్ కరెంటు ఇవ్వాలని సబ్ ఇంజనీర్ గారికి వినతిపత్రం అందజేసిన అన్వేష్ రెడ్డి , ఎర్ర శేఖర్ గారు, జియంఆర్  తదితర ముఖ్య కాంగ్రెస్ నాయకులు.