ప్రాజెక్ట్ డిలే కు కాంగ్రెస్సే రీజన్ 

ప్రాజెక్ట్ డిలే కు కాంగ్రెస్సే రీజన్ 
  • కేసులు వేసింది,వేయించింది వాళ్లే
  • కాంగ్రెస్ పార్టీ నేతలేనన్న ఎమ్మేల్యే 
  • ప్రజలను రెచ్చగొట్టింది కూడ వాళ్లే 
  • కేసీఆర్ మొదటి ప్రాధాన్యత పాల మూరే
  • కాంగ్రెస్ నేతల కుట్రల ఫలితమే 
  • నిర్మాణంలో వెనుకబాటు 
  • పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక 
  • 27న జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి  మంత్రి హరీష్ తో ఓపెనింగ్

ముద్ర, జడ్చర్ల :  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజక్ట్ నిర్మాణం పనులు వెనుకబా టుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరే ప్రధాన కారణం అని మాజీ మం త్రి,జడ్చర్ల ఎమ్మేల్యే సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి హరిజన వాడ లో శనివారం ఉదయం పర్యటించిన ఆయన హరిజనులతో కలిసి టిఫిన్ చేశారు.అనంతరం క్షేత్ర స్థాయిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు అర్హు లైన లబ్ధిదారులను ఎంపిక చేసేం దుకు స్థానికంగా పరిస్థి తుల ను పరిశీలించారు. ఒకే కుటుం బం లో ఇరుకుగా ఉండి, సహ జీవ నాని కి ఇబ్బందులు పడుతున్న పేద లను గుర్తించి డబు ల్ ఇండ్లలో లబ్ది పొం దేలా చూస్తా మని ప్రజలకు హామీ ఇచ్చా రు. అనంతరం స్థానిక విలేఖ రులతో మాట్లాడుతూ ఇటీవలి కాలంగా కొందరు పోలి టికల్ టూరి స్టులు జిల్లాలో పర్యటి స్తూ పాల మూరు రంగారెడ్డి ఎత్తిపో తల పను లపై అవాకులు, చవాకు లు మాట్లా డుతూ ప్రజలను తప్పు దోవ పట్టిం చి రాజకీయ లబ్ది పొం దాలని చూ స్తున్నారని విమర్శిం చారు. కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులకంటే ముందుగానే సీఎం కేసీఆర్ పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనులకు అధిక ప్రధాన్యత కల్పించా రని అన్నారు. దీన్ని చూసి జీర్ణించు కొని కొందరు కాంగ్రెస్ లీడర్లు గ్రీన్ ట్రిభ్యునల్ కేంద్రంగా కేసులు వేసి పనులను నిలువరించారని తెలిపా రు. ఇది కాక 2013 లో కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన భూ సేకరణ చ ట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరి హారం చెల్లింపు విషయం ప్రజ ను రెచ్చగొట్టి కోర్టులో కేసులు వేయించారని తెలిపారు. ఈ క్రమం లోనే పాల మూరు రంగారెడ్డి ఎత్తి పోతల పను ల్లో  ఆలస్యం జరి గింద ని,దీనికి కార ణం కాంగ్రెస్ పార్టీ నేత లే అని చమ త్కరించారు. వీట న్ని టిని ప్రజలు గమనిస్తున్నారని తెలి పారు.ఓట్ల కోసం ప్రభుత్వం పట్ల తప్పుడు ఆరోపణలు చేయడం మా నుకోవాలని సూచించారు. 

27న ఆస్పత్రి ప్రారంభం 

 జడ్చర్ల మున్సిపాలి టీ పరిధిలోని గంగాపూర్ రోడ్డులో రూ.33 కోట్లు వ్యయం చేసి నిర్మించిన 100 పడ కల ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ నెల 27న ప్రారంభించనున్నామని ఎమ్మే ల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.దీని వల్ల నియోజకవర్గ పరిధిలోని అనేక మం డలాలు,గ్రామాలకు చెందిన పేదలకు వైద్య సేవలు అందుబాటు లోకి రానున్నవాని తెలిపారు. ఎమ్మేల్యే వెంట జడ్పీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య,  మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, వైస్ చైర్ పర్సన్ పాలాది సారిక రామ్మోహ న్,మార్కెట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్,బాద్మి రవి శంకర్,మాజీ ఎంపిపి లక్ష్మీ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.