అప్పు ఇవ్వలేదని ఇంటి ముందు శవం తో ఆందోళన

  •  నర్సప్పగూడ కాట్న సత్యనారాయణ మృతి 
  • షాద్ నగర్ భగీరథ కాలనీలో సంఘటన 

రంగారెడ్డి జిల్లా: అప్పుగా తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా మానసికంగా వేధించడంతో అనారోగ్యం పాలైన కాట్న సత్యనారాయణ అనే వ్యక్తి మరణించాడాని  కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి ముందు శవాన్ని వేసి  ధర్నా చేస్తున్నారు.ఈ సంఘటన షాద్‌నగర్ లోని బగిరధ కాలనీలో శనివారం జరిగింది. 

ఎస్బీ పల్లికి చెందిన ఎర్ర శ్రీనివాస్.. మృతుడు సత్యనారాయణ వద్ద ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పించుకుంటున్నాడని ఎన్నో సందర్భాల్లో డబ్బులు వాపస్ ఇస్తానంటూ మానసికంగా వేధించాడని కుటుంబీకులు తెలిపారు. సత్యనారాయణ ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో అనారోగ్యం పాలయ్యాడని, ఇటీవలే అతని తలకు సర్జరీ కూడా జరిగిందని,  డబ్బుల కోసం రోజు అతని కోసం తిరగడంతో అనారోగ్య పాలయ్యాడ నీ బందువులు ఆరోపించారు.. ఈరోజు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు అతని ఇంటి ముందు వేసి ధర్నాకు పూనుకున్నారు. ఏడేళ్ల క్రితం అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తమను మానసికంగా వేధించిన ఎర్ర శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు న్యాయం కోసం ధర్నా చేస్తున్నారు..