అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు ప్రదానం

అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు ప్రదానం

భూదాన్ పోచంపల్లి,ముద్ర;భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని పోచంపల్లి కో -ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ ఆవార్డులు లభించినట్లు చైర్మన్ కర్నాటి బాలసుబ్రమణ్యం, సీఈవో సీత శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న గోవాలో జరిగిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆత్మీయ సమ్మేళనంలో 750 కోట్ల డిపాజిట్ సైజులో  బెస్ట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ,బెస్ట్ ఈ పేమెంట్ ఇనిశియేటివ్ జాతీయ అవార్డులను రిజర్వ్ బ్యాంక్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నాకర్ దేప్లే చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ఎల్బీనగర్ పట్టణంలో, నవంబర్ మాసంలో హయత్ నగర్ పట్టణంలో బ్యాంకు నూతన శాఖలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.2022-2023 మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయని, ఈ అవార్డులు ఖాతాదారుల నమ్మకం విశ్వాసం వలన సాధించినట్లు తెలిపారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సూరపల్లి రమేష్, డైరెక్టర్లు సీత దామోదర్, భోగ విజయ్ కుమార్, చిక్క కృష్ణ, పున్న లక్ష్మీనారాయణ, కొండమడుగు ఎల్ల స్వామి, కడవేరు కవిత, పిల్లలమర్రి అర్చన, రాపోలు వేణు, బిట్టు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.