ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్  సేవలు ప్రారంభం

ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్  సేవలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును  జిల్లా ఎస్పీ  సిహెచ్.సింధు శర్మా ఐ.పి.ఎస్ గురువారం ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా నిరూపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్ కు అవసరమయ్యే మరమ్మతులు చేసి రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తిరిగి ప్రారంభించడం జరిగింది.

2013 లో NH-44 అధికారుల అనుమతితో రోడ్డుప్రమాదాల నివారణ కొరకు   ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్ ను టేక్రియాల్ X రోడ్ వద్ద ప్రారంభించి కొద్దిరోజులు సేవలు  అందించారు.  తరువాత  మరమ్మత్తుల వల్ల చాలా కాలముగా నిరూపయోగముగా ఉంది.  ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్  కామారెడ్డి రూరల్ సీఐ  ఉంటూ పర్యావేక్షించడం జరుగుతుందని,   NH-44 పోలీసు పెట్రోల్ వాహనం అధికారులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటూ కామారెడ్డి జిల్లా పరిదిలోని  NH-44 రహదారిపై ప్రమాదాల నివారణకు కృషచేస్తారని జిల్లా యస్ పి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ కాజల్ సింగ్, అడిషనల్ ఎస్‌పి కె. నరసింహారెడ్డి, డి‌ఎస్‌పిలు ప్రకాష్, శ్రీనివాస్, మధన్ లాల్,  ఎస్బి ఇన్స్పెక్టర్ జార్జ్, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.