న్యాయవాదుల విధుల బహిష్కరణ

న్యాయవాదుల విధుల బహిష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో న్యాయవాదిపై శుక్రవారం జరిగిన దాడిని నిరసిస్తూ నిర్మల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. న్యాయవాదుల కక్షిదారులకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తారు తప్ప వ్యక్తిగత కక్షలు ఉండవని అన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయవడిపై దాడి చేయటం హేయమని అన్నారు. న్యాయవాదుల పరిరక్షణకు చట్టం చేయాల్సిన అవసరం ఉందని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేందర్, ఉపాధ్యక్షురాలు కవిత, గ్రంథాలయ కార్యదర్శి అర్చన తదితరులు ఉన్నారు.