పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి

పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి

నిర్మల్ జిల్లా ముదిరాజ్ మహాసభ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఒక బాధ్యతా యుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ముదిరాజ్ కులస్తులను కించపరచిన పాడి కౌశిక్ రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నిర్మల్ జిల్లా ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా స0ఘ బాధ్యులు మాట్లాడుతూ ముదిరాజ్ కులానికి చెందిన ఒక కెమెరామెన్ ను కిడ్నాప్ చేసి విచక్షణా రహితంగా చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు. అంతే కాకుండా ముదిరాజ్ లను అవమానించే రీతిలో మాట్లాడిన కౌశిక్ రెడ్డి కి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. మరో పక్క తెలంగాణ అమరవీరుల సంస్మరణ జరుగుతుంటే అమరవీరుల స్థూపాన్ని కూల్చివేసిన ద్రోహి కౌశిక్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యత వహించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.