రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శ్రీహరిరావు

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శ్రీహరిరావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది కే శ్రీహరి రావు బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల అధికార పార్టీ నుంచి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ కి తెలంగాణలో విజయం సాధించి బహుమతిగా ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.