శ్రీరామనవమి వేడుకల్లో  దగ్ధమైన ఆలయ పందిరి

శ్రీరామనవమి వేడుకల్లో  దగ్ధమైన ఆలయ పందిరి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తారాజువ్వ పడటంతో వేణుగోపాలస్వామి ఆలయ పందిరి దగ్ధమైంది.  పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆలయంలో జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.