విజయనగరం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం

విజయనగరం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం

విజయనగరం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఏపీ సీఎం జగన్​ చెప్పారు. ఉత్తరాంధ్రకు పోర్టు మణిహారం అయితే కొత్త విమానాశ్రయం కిరీటం కాబోతోందన్నారు. రూ. 194 కోట్లతో తారకరామా తీర్థ సాగరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. రూ. 24 కోట్లతో ఫిష్​ ల్యాండింగ్​ సెంటర్​ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం ఉత్తరాంధ్రకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మూడేళ్లలో కొత్త ఎయిర్​పోర్టు తయారవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎందుకు ప్రాజెక్టులు చేపట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు టెంకాయ కొట్టేవారు. తాము గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకునేవారు. రూ.5 వేల కోట్లతో రెండు రన్​వేలతో ఎయిర్​పోర్టును నిర్మిస్తున్నాం. తొలి దశలో 60 లక్షల జనాభాకు అనుగుణంగా ఎయిర్​పోర్టు నిర్మిస్తున్నామన్నారు. దీన్ని 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపారు.