అకాల వర్షాల కారణంగా దెబ్బ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

అకాల వర్షాల కారణంగా దెబ్బ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : అకాల వర్షానికి వరి పంట నీట మునిగింది మామిడి పండ్లు తోట ను పరిశీలించిన ఎమ్మెల్యే. ఈరోజు గద్వాల నియోజకవర్గం  కె.టి దొడ్డి మండలంలోని గంగన్ పల్లి, కొండాపురం  గ్రామాలలోని అకాల వర్షానికి పంటలను దెబ్బ పరిశీలించిన  గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి, వరి పొలంలోకి వెళ్లి  వరి పంటను పరిశీలించడం జరిగినది. అదేవిధంగా మామిడి తోటలో కూడా పరిశీలించడం జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

రైతులు అధైర్య పడవద్దని అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తగు నష్టపరిహారాన్ని అందిస్తామని. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ  వేసవికాలంలో వర్షాలు రావడం. రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు రోజుల నుంచి అకాల వర్షాలు రావడం వల్ల రైతులకు చేతికొచ్చిన పంట నాశనం కావడం జరిగింది. ప్రకృతి వైపరికం వల్ల వర్షాలు రావడం జరిగింది అని పేర్కొన్నారు. పంటలు అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రైతుల వివరాలు అధికారులు పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపియాలని కోరారు. 

వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి ఫోన్ ద్వారా మాట్లాడి తీసుకెళ్లి  సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు, కాబట్టి వెంటనే ప్రభుత్వం తరఫున ఏదో ఒక రూపంలో మా ప్రాంత రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి ని కోరారు. మంత్రి కూడా వెంటనే సానుకూలంగా  స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి రాజశేఖర్ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచ్ సత్యనారాయణ,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్ రావు, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.