తెలుగు పండుగలు ఎంతో అద్భుతం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

తెలుగు పండుగలు ఎంతో అద్భుతం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : తెలుగు పండుగలు ఎంతో అద్భుతమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గద్వాల జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ రోజున తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు కారం తో తయారు చేసిన పచ్చడిని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారని చెప్పారు. ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు, ఆనందాలు బాధలన్నీటికి పచ్చటి ప్రతీక అని అన్నారు.

ఉగాది పేరులోనే యుగ ఆది అని అర్థం ఉందని, అనగా ఈ ఏడాది ప్రారంభమని తెలిపారు. తెలుగువారికి ఉగాది పండుగతోనే సంవత్సరం ప్రారంభం అవుతుందని, సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనసు తెలియజేస్తుందని ఆమె తెలిపారు. ప్రజలు సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, అభివృద్ధిలో మన జిల్లా రోల్ మెడల్ గా, ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.