విద్యార్థులు వేసవిలో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

విద్యార్థులు వేసవిలో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల:విద్యార్థులు వేసవిలో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ, ఏకలవ్య మోడల్ గురుకులాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి శిభిరం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 22నుండి మే  6 వరకు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల. గట్టు నందు బాలికలకు ప్రత్యేకంగా నిర్వ హించ బడుచున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఏకలవ్య మోడల్ గురుకులాల నుండి 2000 మంది బాలికలు ఈ శబిరంలో పాల్గోననున్నారని, ఉదయం 8 నుండి సాయంత్రం 6.00 గంల వరకు సైన్స్, చిత్రలేఖనం, నాట్యం, సంగీతము వంటి వివిధ అంశాలలో విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యా లను ఈ శిబిరం ద్వారా అందజేయనున్నారన్నారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లోరెన్స్ రాణి, జిల్లా సమన్వయ అధికారి  రఘు, ప్రిన్సిపాల్ సి.హెచ్. వాణి పాల్గొన్నారు.