మా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీకు 70 ఏళ్ళు సరిపోలేదా.?

మా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీకు 70 ఏళ్ళు సరిపోలేదా.?
  • ఏ గ్రామం చూసినా అన్ని సమస్యలే...
  • 11వ రోజు నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో గొంగళ్ళ రంజిత్ కుమార్.

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : నియోజకవర్గంలోని ఏ గ్రామం చూసినా అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా నెట్టి వేయబడ్డాయని మా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీకు 70 ఏళ్లు  సరిపోలేదా? అని గొంగళ్ల రంజీత్ కుమార్ అన్నారు. 11వ రోజుకు చేరిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూరు,గోనుపాడు, సంగాల,మర్లపల్లి, జిల్లెడబండ,ధరూర్ మండలంలోని పార్చర్ల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. సోమవారం శెట్టి ఆత్మకూరు గ్రామంలోని గొంగళ్ల రంజీత్ కుమార్. ఉదయాన్నే వార్త పత్రికలను చదివిన అనంతరం పాదయాత్రకు సిద్ధమయ్యారు. గోనుపాడు,సంగాల గ్రామ శివారులోని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా ఓ వ్యవసాయ పొలంలో మిర్చి పంట పొలాన్ని గొంగళ్ల రంజిత్ కుమార్. స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న కూలీ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.

గద్వాల నియోజకవర్గంలోని ఏ గ్రామం చూసినా ఆ గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయని మా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీకు 70 ఏళ్ళు సరిపోలేదా? అని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. మీ పరిపాలనలో అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని అలాంటి సమస్యలను పరిష్కరించకుండా కేవలం గ్రామాల వైపు కూడా కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉందని, మీ పరిపాలన ఏ అభివృద్ధి పనులు చేశారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటివరకు అర్హులైన వారికి అనేక గ్రామాలలో వృద్ధాప్య,వికలాంగు,వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా మరి ఆ పథకాలన్నీ కూడా ఎవరెవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని అన్నారు.

ఆయా గ్రామాలలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,లేక తాగునీటి సమస్యలతో గ్రామ ప్రజలు సతమతమవుతున్నారని ప్రజలకు మేలు చేయాల్సిన పాలకులు 70 ఏళ్ల నుండి మరి ఏం చేస్తున్నారో ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతా అంధకారంలో ఉందని అన్నారు. రాబోయే రోజులలో బహుజన నాయకత్వాన్ని నిలబెట్టడం కోసం ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ పేదవర్గాల తరఫున ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకగా పోరాటం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో సరైన విద్య,వైద్యం, సంక్షేమం అభివృద్ధి కోసం మా పోరాటం చివరి వరకు కొనసాగిస్తామని రాబోయే రోజులలో బహుజన నాయకత్వాన్ని నిలబెట్టేందుకు గద్వాల కోటపై బహుజన జండా ఎగిరే వరకు బహుజనుల తరపున ప్రశ్నించే గొంతుకగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున ముందుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న, నాయకులు నాగేష్, వీరేష్, అవనిశ్రీ, రంగస్వామి, పరశురాముడు,ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షుడు మునెప్ప,గట్టు మండల అధ్యక్షుడు బలరాం, నాయకులు ఆలూరు వెంకట్రాములు, జమ్మన్న,హనుమంతు, నర్సింహులు,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్,కార్యదర్శి తిమ్మప్ప,కె.టి.దొడ్డి మండల నాయకులు అంజి,ఏసు,భీమన్ గౌడ్,ఉపేంద్ర, రాము,ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.