ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి
District Collector Valluri Kranti

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల్: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. అధికారులకు, తాసిల్దారులకు  ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన  ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల  ప్రజల నుండి వచ్చిన 85  ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. వీటిలో  ఆసరా పెన్షన్ 3, ధరణి కి సంబంధించిన 75 భూ సమస్యలపై, రెండు పడకల గదులకు సంబంధించి 7 దరఖాస్తులు వచ్చాయని, వారిని సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా  పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన దరకాస్తులను పరిశీలించి మీ సేవలో సక్సేషన్ కింద దరఖాస్తు చేసుకోవాలని దరకస్తుదారుడికి వివరించారు. ఉండవెల్లి, ధరూర్, మండలాలకు సంబంధించిన  పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన  భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించి ఆయా మండలాల తాసిల్దార్ లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఏ ఓ యాదగిరి, సూపరిడెంట్ రాజు, జిల్లా అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.