గులాబీ జెండానే దేశ అభివృద్ధికి పునాది

గులాబీ జెండానే దేశ అభివృద్ధికి పునాది

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో బీఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈరోజు అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలంలోని సంకపురం గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్రహాం, రాష్ట్ర కన్జ్యూమర్ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఆర్డీస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి, గ్రామ సర్పంచ్ సుజాత రాముడు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ.

కేసీఆర్ నాయకత్వంమే మనకు రక్ష..
ఈ గులాబీ కండువా నే మనకు శ్రీరామరక్ష..
ఈ గులాబీ  జెండా నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధికి చిహ్నం..
ఈ గులాబీ జెండానే మనకు పదవులు..
ఈ గులాబీ జెండానే శ్రీరామరక్ష..
ఈ గులాబీ జెండానే సంక్షేమ పథకాలు..
ఈ గులాబీ జెండానే రాష్ట్ర అభివృద్ధి..
ఈ గులాబీ జెండానే దేశాభివృద్ధి..
ఈ గులాబీ జెండా నే మనకు ఆత్మ గౌరవం..
ఈ గులాబీ జెండానే మనకు గుండె బలం..

ఈ గులాబీ జెండాను నిరంతరం రక్షించుకునే బాధ్యత మనందరి పైన ఉంది అని అన్నారు. కెసిఆర్. నాయకత్వంలో ప్రతి పేదింటి గడప గడప గడపకు సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ కా సర్కార్ అనే నినాదంతో మన గులాబీ జెండా ఢిల్లీ కోటలపై ఎగరవేసే సమయం ఆసన్నమైనది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.