ఆరు గారంటీ పథకాలతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు

ఆరు గారంటీ పథకాలతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు
  • కేశంపేట జడ్పిటిసి సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి
  • కొత్తూరులో జోరందుకున్న కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

ముద్ర/షాద్ నగర్  :- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యా రెడ్డి పథకాలపై పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని కేశంపేట జడ్పిటిసి సభ్యురాలు విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తూరు మండల కేంద్రంతో పాటు ఎస్బి  పల్లి, ఇనుముల్ నర్వ గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరుగా రెడ్డి పథకాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యురాలు విశాల శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ జరుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.

వరుస ఎన్నికల కోడ్ రావడంతో సంక్షేమ పథకాలకు కొంత జాప్యం చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ యుద్ధం కావాలని పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి హామీ ఇస్తే వాటిని అమలు చేసే వరకు వదిలి పెట్టేది లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీ చందు రెడ్డికి మద్దతుగా ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ తోపాటు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.