తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
  • సోనియా, రాహుల్ గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయింది
  • కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని  గద్దెదించాలి
  • రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ముద్ర,పానుగల్:- ద‌శాబ్దాల కాలం నాటి  తెలంగాణ ప్ర‌జ‌ల అకాంక్ష‌ల‌ను నెర‌వేర్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్య‌త ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పానుగల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి తండాలో సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్యనాయక్ లతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.అనంతరం ,బుసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న సోనియా గాంధీ,రాహుల్ గాంధీ రుణంను తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ఓటేసి  సోనియమ్మ రుణం తీర్చుకుందామ‌ని, రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేద్దామ‌ని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినందు వ‌ల్లే ఇవాళ 24 గంట‌ల క‌రెంట్,సాగు నీరు,తాగునీరు,రైతుభ‌రోసా వ‌స్తుంద‌నే విషయాన్ని గ్ర‌హించాల‌ని సూచించారు.కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల‌ని కాంగ్రెస్ భావ‌జాల పార్టీల‌న్ని ఏక‌మై పోరాటం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ లు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేసిన మోసాల‌ను గ‌మ‌నించాల‌ని కోరారు.అస్త‌వ్య‌స్తంగా ఉన్న పాల‌న‌ను గాడిలో పెడుతున్నామ‌ని చెప్పారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు.కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి మ‌ల్లు ర‌విని  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి

పానగల్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.రైతులు పండించిన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. రైతులకు  మద్దతు ధర ఇచ్చేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులను కలిగించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు మాజీ జెడ్పిటిసి రవికుమార్ మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ సాగర్,రాము యాదవ్, బ్రహ్మం,పుల్లారావు,వాల్మీకి నాయుడు