నెరవేరబోతున్న వనపర్తి ప్రజల చిరకాల వాంఛ 

నెరవేరబోతున్న వనపర్తి ప్రజల చిరకాల వాంఛ 
  • వనపర్తి మీదుగా రైల్వే లైన్కు సర్వే క్లియర్
  • మాజీ మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డి 

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి మీదుగా గద్వాల నుండి డోర్నకల్ కు కొత్త రైల్వే లైను చేపట్టడానికి లైన్ క్లియర్ అయిందని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి చిన్నారెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

వనపర్తి ప్రజల చిరకాల కోరిక గద్వాల్ టు మాచర్ల రైల్వేలైను అని, గద్వాల్ నుండి ఆరేపల్లి, కడుకుంట్ల, వనపర్తి, గోపాల్పేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ మీదుగా డోర్నకల్ వరకు 296 కిలోమీటర్లు భూమి సర్వే పూర్తయింది అని, దీనితో వనపర్తి నియోజకవర్గ చిరకాల వాంఛ నెరవేర పోతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ త్వరలోనే ఇవ్వబోతున్నారు అని ఆయన తెలిపారు. రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అలాగే సర్వే నిర్వహించిన రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, పిసిసి డెలికేటెడ్ శంకర్ ప్రసాద్, మాజీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, పిసిసి సభ్యులు కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిలే రాములు, ఐ సత్య రెడ్డి, రాష్ట్రమైనారిటీ నాయకులు అక్తరు, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ నందిమల్ల యాదయ్య, చీర్ల జనార్ధన్ గారు, కౌన్సిలర్ పద్మ పరశురాం, దాసరాజు భాస్కర్, బాబా, అబ్దుల్లా, రాగి అక్షయ్, వెంకటేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి, వేణయ్య చారి, ధ్యార పోగు విజయ్, దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు రమేష్, ఎసి సేల్ కొంకి వెంకటేష్, ఎస్టీ సేల్ రాష్ట్ర కార్యదర్శి దేవిజా నాయక్, రాగి వేణు, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జానకి రాములు, మండల అధ్యక్షులు నారాయణ, విజయవర్ధన్ రెడ్డి, పెంటయ్య యాదవ్, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్, ఎండి బాబా, ఏఐపిసీ కోఆర్డినేటర్ నాగార్జున, జానంపేట నాగరాజు, మెంటపల్లి ధర్మారెడ్డి, నాగిరెడ్డి, చిట్టెమ్మ, జయమ్మ, మసికొండ మహేష్, 21వ వార్డు అధ్యక్షులు డి.విజయబాబు డి.శివశంకర్, డి.శివ, అబ్దుల్లా నందిమల్ల సందీప్ యాదవ్, క్యామ బాల్రాజ్, వాసా నాగేశ్వర్ ప్రభాకర్ రెడ్డి, గట్టు మన్యం శ్రీనివాసులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఎం దేవన్న యాదవ్, చంద్రశేఖర్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.