చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

 సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో సిఐటియు వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై మండల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక,  కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్ల సంస్థలకు దోచిపెడుతుందని వారు అన్నారు.  లేబర్ కోడ్ బిల్లులను రద్దుచేసి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని అన్నారు.  

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను అదుపుచేసి వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని అన్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 5న జరిగే  కిసాన్ సంఘర్ష ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు  బాల్ రెడ్డి,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు,  రైతు సంఘం మండల కార్యదర్శి మహబూబ్ బాషా,  నాయకులు సిహెచ్ వెంకటయ్య,  నిరంజన్,  రామకృష్ణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.