టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాకిటి శ్రీధర్

టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాకిటి శ్రీధర్

ముద్ర ప్రతినిధి, వనపర్తి: టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా వంగూరు ప్రమోద్ రెడ్డిని, వనపర్తి పట్టణ సమన్వయకర్తగా అరుణ్ ప్రకాష్ ను, సీనియర్ సమన్వయకర్తగా రాములు యాదవ్ ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గడపకు టిఆర్ఎస్ చేసిన పథకాలను సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో డిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఎంపిక అయిన నాయకులకు మంత్రి నిరంజన్ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.