రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రతి భారతీయ పౌరుడు ఆదర్శంగా తీసుకునే గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారత దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ఆయన ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారన్నారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసి, కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారని, అన్నివర్గాల ప్రజలకు మత స్వేచ్చ కల్పించి ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్ళకు తగ్గించారని అన్నారు. భారత దేశంలో సాఫ్ట్వేర్ రంగానికి పునాది బాటలు వేశారని, 1986 లో అయోధ్య లో రామ మందిరంలో తలుపులు తెరిచి, రామ మందిర నిర్మాణానికి కృషి చేసి.. 1989 లో అయోధ్య లో శిలా న్యాస్ నిర్వహించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా  పార్లమెంట్ ను గౌరవించిన ప్రజాస్వామ్య వాది రాజీవ్ గాంధీ. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ బాటలో నడువాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు  గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులూ బండ శంకర్, కామటాల శ్రీనివాస్, గుండా మధు తదితరులు పాల్గొన్నారు.