ఎంపీసీలో స్టేట్ 2వ ర్యాంకు సాధించిన విద్యార్థులను అబినంధించిన ఎమ్మెల్యే 

ఎంపీసీలో స్టేట్ 2వ ర్యాంకు సాధించిన విద్యార్థులను అబినంధించిన ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జగిత్యాల పట్టణ నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఎంపీసీలో స్టేట్ 2వ ర్యాంకు, బైపిసి విభాగం లో 4వ, 6 వ ర్యాంక్  సాధించగా వారిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అబినంధించారు. జూపాక మాధురి   ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 466/470 సాధించగా , నిన్న ప్రకటించిన ఇంప్రూవ్ మెంట్ ఫలితాల్లో  అటకాపురం షాలిని 466/470 మార్కులతో ఇద్దరూ స్టేట్ రెండవ ర్యాంకు, మెడిపెళ్లి వర్షిని బై పి సి విభాగంలో 430/440 మార్కులతో స్టేట్ 6 వ ర్యాంక్, ద్వితీయ సంవత్సరంలో సరిగల్ల శ్రియ బైపిసి విభాగం లో 987/1000 మార్కులతో స్టేట్ 4వ ర్యాంక్ సాధించగా వారిని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే  పుష్ప గుచ్చాం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ , ప్రిన్సిపల్ గాలిపెళ్ళి ఈశ్వర్, ఉపాద్యాయులు తదితరులు ఉన్నారు.