తాటిపల్లి విద్యార్థికి కాంస్య పథకం..

తాటిపల్లి విద్యార్థికి కాంస్య పథకం..

ముద్ర, మల్యాల: జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో  తాటిపల్లి జెడ్పిహెచ్ఎస్ విద్యార్థి కె. వివేక్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ నెల 6 నుంచి 8 వరకు అనంతపూర్ లో జరిగిన 13వ మినీ సబ్ జూనియర్ టోర్నమెంట్ లో తెలంగాణ U-13 బాయ్స్ విభాగం నుంచి వివేక్ మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించాడు. ఈ సందర్బంగా సర్పంచ్ బింగి జోష్ణవేణు, ప్రధానోపాధ్యాయులు కండ్లే  గౌతమ కృష్ణ రావు, పిఈటి బీరయ్య, సాఫ్ట్ బాల్ జగిత్యాల జిల్లా సెక్రటరీ వెంకటేష్, పాఠశాల సిబ్బంది, పలువురు నాయకులు, యువజన సంఘ సభ్యులు వివేక్ ను అభినందించారు.