ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి

ముద్ర,తెలంగాణ:-నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు బస్సు చక్రాల కింద నలిగి చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి బయలుదేరిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళుతున్న క్రమంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. 

పోలీసులు నార్సింగ్ ఓఆర్‌ఆర్‌కు చేరుకుని తనిఖీ చేశారు. ట్రావెల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. పోలీసులు గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రేన్ సహాయంతో సిబ్బంది బస్సును బయటకు తీశారు.