మంత్రి కొప్పుల ఇలాకాల సర్పంచుల తిరుగు బావుటా

మంత్రి కొప్పుల ఇలాకాల సర్పంచుల తిరుగు బావుటా
  • చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని దళిత సర్పంచు రాజీనామా 
  • మండల కార్యాలయల నిర్మాణ స్థల పనులను అడ్డుకున్న మరో సర్పంచు 
  • సర్పంచులలో తీవ్ర వ్యతిరేకత ...
  • బిల్లులు రాకపోతే ఎన్నికల్లో చేతులేత్తేస్తాం అంటున్న సర్పంచులు 
  • సర్పంచుల తీరుఫై మంత్రి ఆగ్రహం ... 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అభివృద్ధి పనులకు లక్షలు వెచ్చించి అప్పుల పాలు అయిన సర్పంచులు డబ్బులు ఇస్తార .. రాజీనామా చేయమంటార.. అవార్డులు మీకు అప్పుల బదాలో మేమా .. అంటూ అధికార పార్టీ సర్పంచుల తిరుగుబాటుతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సంకట పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని ఇతర నియోజక వర్గాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలో  గ్రామా సర్పంచులు లక్షలు వెచ్చించి గ్రామాల్లో హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు, మనఊరు మనబడి, రైతు వేదికల అభివృద్ధి పనులతో పాటు గ్రామాల్లో సిసి  రోడ్డులా నిర్మాణాలు లాంటి పలు అబివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసారు. ఇందులో బిఆర్ ఎస్ పార్టీకి చెందిన సర్పచులు, ప్రజా ప్రతినిధులు  90 శాతం ఉన్నారు.  పనులు పూర్తి అయి ఎంబి రికార్డు అయి నెలలు గడుస్తున్న బిల్లులు మంజూరు కావడం లేదు.  మంత్రి సూచనల మేరకో, ఉన్నతాధికారులు సూచనల మేరోకో ప్రభుత్వ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తిసుకేలుదామని, ఫైన ఉన్నది తమ నాయకులే కదా బిల్లు త్వరగానే వస్తాయని భావించిన సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అభివృద్ధి పనుల కోసం కొందరు గ్రామా పంచయతిని బట్టి  రూ.50 లక్షల నుంచి కోటి వరకు అప్పులు తీసుకోచ్చి పనులు పూర్తి చేశారు.  మరికొందరు, అక్కడ ఇక్కడ తెలిసిన వారివద్ద  చేబదలు తీసుకుని వచ్చి అభివృద్ధి  పనులను పూర్తి చేశారు. అందుకు గాను  పలు పంచయతిలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్చ, తదితర అవార్డులను కూడా ప్రకటించింది. పనులు పూర్తి చేసి ఏడాది గడుస్తున్న బిల్లుల కోసం చెప్పులు అరిగేల తిరిగిన బిల్లులు రావడం లేదని, సర్పచులు బాకి తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుండడం... కొందరు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో సర్పంచులు ఆందోళనకు గురి అవుతూ వస్తున్నారు. తెలంగాణను అవార్డులు రావడంలో తామే కీలకమని అలాంటి తమను విస్మరిస్తున్నారని అధికార పార్టీ  సర్పచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   అధికార పార్టీ సర్పంచులు స్వయంగా నిరసనలు చేయడం వలన  ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి . అసలు అధికార  బిఆర్ ఎస్ సర్పచుల పరిస్థితి ఇలా ఉంటె ఇంకా ప్రతిపక్షపార్టీల సర్పంచులు, కాంట్రాక్టర్ల, ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించ వచ్చు అని ప్రజలు బావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అటు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళే ప్రమాదం ఉంది. గ్రామాలకు సర్పంచులే పట్టుకొమ్మలు, అలాంటి సర్పంచులే అధికార పార్టికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారంటే ... ఇవి ప్రజల్లోకి ఏవిధమైన సంకేతాలు తిసుకేల్తాయో ఇట్టే అర్థం అవుతుంది. బుగ్గారం మండలం చిన్నపూరు  గ్రామా పంచాయతీకి ఏడాది కాలంగా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని బిఆర్ ఎస్ పార్టీకి  చెందిన దళిత సర్పంచ్ దమ్మ లతశ్రీ తన సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడం, ఎస్ ఎస్ జి గ్రామా పంచాయతిగ ఎంపిక అయిందని పనుల విషయంలో అధికారులు ఒత్తిడి చేయడం, ఎంపిడబ్య్లు  జీతాలు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే లక్షల్లో అప్పులపాలు అయిన తాను  నిధులు రాక గ్రామా ప్రజలకు సేవ చేయలేని అసమర్థ సర్పంచ్ అని తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు , కార్మికుల జీతాలు లేక మురికి కాల్వలు తీసే పరిస్థితి లేక, విధ్యత్ బల్బులు పెట్టలేక, బ్లీచింగ్ చేయాలేక, ట్రాక్టర్ డిసిల్ కొనలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, పనులు చేయలేక ప్రజలను ఇబ్బందులు పెట్టలేక తాను రాజీనామా చేస్తున్నట్లు దమ్మ లతశ్రీ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్  పిఎది కూడా  ఇదే గ్రామం.. మంత్రి పి ఎ ఉన్న గ్రామం పరిస్థితి ఇలా ఉంటె ఇంకా మిగతా గ్రామాల సర్పంచుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటె బుగ్గారం మండల కేంద్రంలో మండల కార్యాలయాల నిర్మాణం కోసం గుట్ట బోరుకు స్థల పరిశీలన చేసి భూమి చదున చేసే కార్యక్రమాన్ని ప్రారంబించారు. అయితే ప్రజలకు అనువైన చోట గ్రామంను అనుకోని ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని ఇలా దూరంగా నిర్మిస్తే ఎలా అని గ్రామా సర్పంచు మూలా సుమలత స్థానిక ప్రజలతో కలిసి వచ్చి పనులను అడ్డుకున్నారు.  అధికార పార్టీ సర్పచులు ఆందోళనలు విస్తరించక ముందే వారికి రావలిసిన బిల్లులు చెల్లించి అప్పులో కూరుక పోయిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే అధికార పార్టీ సర్పచుల ఆగ్రహానికి గురికావాల్సిందే . ఏది ఏమైనప్పటికి  నియోజక వర్గంలో అధికార పార్టీ సర్పంచు బిల్లులఫై రాజీనామా వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్ళగా మన సర్పంచులను కూడా మనం అదుపు చేయకుంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమచారం. మొన్న జరిగిన దశాబ్ది ఉత్సావాల్లోనే సర్పంచులు జేబులోంచి ఖర్చులు పెట్టారు .. బిల్లులు రాకపోతే ఎన్నికల్లో చేతులేత్తేస్తాంమని సర్పంచులు చెబుతున్నారు. వీటికి ఇక్కడే పుల్ స్టాప్ పెట్టకుంటే వీటి ప్రాభవం రాబోయే ఎన్నికల ఫై పడే అవకాశం ఉంది.