బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్..

బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్..
  • సిరిసిల్ల మత్య్స శాఖ అడ్హక్ కమిటి ఎన్నికలు రణరంగం
  • ఆఫీషియల్ తాత్కాలిక కమిటి ఎన్నికకు రాజకీయ రంగు
  • బీఆర్ఎస్ జిల్లా నేత  కల్పించుకోవడంతో.. ముదిరాజ్ సంఘంలో చీలికలు
  • ఎన్నిక వాయిదా వేయాలంటూ ఒక వర్గం.. జరపాలంటూ మరో వర్గం పట్టు
  • తెర ముందు ముదిరాజ్ల లొల్లి.. తెరవెనక బీఆర్ఎస్ నేతల అధిపత్య పోరు..?
  • తీవ్ర ఉద్రిక్తతలు.. ఆందోళన మద్య చొప్పరి రామచంద్రం చీఫ్ ప్రమోటర్ గా ఎన్నిక
  • మొన్న మైనార్టీ సంఘం ఎన్నికల్లో..నేడు ముదిరాజ్ సంఘం ఎన్నికల్లో ఆ నేతకు భంగపాటు
  • ఎన్నిక వాయిదా కోసం చివరి వరకు విఫలయత్నం..
  • సోంత పార్టీ నేతలపైనే కేసులు నమోదుకు ప్రణాళికలు.. చివరకు వెనక్కి తగ్గిన వైనం
  • రాజన్నసిరిసిల్ల లో ఆ నేత తీరు తో బీఆర్ఎస్కు తీవ్ర నష్టం..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీఆర్ఎస్ నేతల తీరుతో మంత్రి కేటీఆర్కు రాజకీయ తలనోప్పులు వస్తున్నాయి. రాజకీయాలకు సంబంధం లేని కులసంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకోవడం అవి చివరకు వికటించి.. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే పరిస్థితి రావడం.. సర్వసాధరణం అవుతుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మైనార్టీ సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేత జోక్యం చేసుకోని మైనార్టీలను రెండు వర్గాలుగా వీడిపోవడమే కాకుండా ఫోన్ సంభాషణలు బహిర్గతం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు మైనార్టీ సంఘం వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పి.. వారిని సముధాయించే పరిస్థితి మరవకముందే ముదిరాజ్ సంఘంలో జోక్యం చేసుకోని నవ్వులపాలయ్యారు. నిన్నమొన్నటి వరకు ఐక్యంగా ఉన్న ముదిరాజ్ మధ్య విబేధాలు చోటు చేసుకునేలా మత్స్యశాఖ సహకార అడ్హాక్ కమిటి ఎన్నికలను వివాదస్పదం చేశారు. దీంతో ముదిరాజ్ సంఘం నేతలు ఆ భీఆర్ఎస్ నేతను ప్రెస్మీట్ ఎట్టి తీవ్రంగా విమర్శించారు.

మా సామాజిక వర్గం కాదు.. ఏం కాదు.. మాలో మాకు గొడవలు సృష్టించే పరిస్థితి తెచ్చారని, ఆ బీఆర్ఎస్ నేత రేపటి నుంచి మాతో చేపలు పట్టడానికి వస్తాడా అంటూ సిరిసిల్ల రూరల్సిఐ ఉపేందర్ తో ముదిరాజ్లు వాగ్వివాదానికి దిగారు. అడ్హాక్ కమిటి ఎన్నిక వాయిదా వేయాలని యమ తిరుపతి వర్గం పట్టుబట్టారు. సమావేశ మందిరంలో బైటాయించి.. నినాధాలు చేశారు. మత్స్యశాఖ అధికారి శివ ప్రసాద్కు వ్యతిరేఖంగా నినాధాలు చేశారు. తాత్కలిక అధ్యక్షులు ఛీప్ ప్రమోటర్ పదవికి ఎన్నికల జరగగా ఇల్లంతకుంట మండలం అనంతారంకు చెందిన చొప్పర రామచంద్రం, వేములవాడ మండలం వట్టెంలకు చెందిన యమ తిరుపతి లు పోటీ పడ్డారు. తిరుపతి కంటే రామచంద్రంకు సనూమారు 15 మందికి పైగా సభ్యుల మద్దతు ఎక్కువగా ఉండటంతో రామచంద్రంను చీప్ ప్రమోటర్గా ప్రకటించారు. ఈ ఎన్నికల ఆన్యాయమని, లిస్టులో లేని ఓట్లను కూడా చేర్చారంటూ.. రాజకీయ ఒత్తిళ్లతో ఎన్నిక చేస్తున్నరంటూ తిరుపతి వర్గం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బలవంతంగా తిరుపతిని బయటలకు తీసుకెళ్లారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య రామచంద్రం ఎన్నికల అధికారికంగా ప్రకటించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా సిరిసిల్ల, వేములవాడ డీఎస్సీల ఆధ్వర్యంలో పోలీసులు బారి బందోబస్తు నిర్వహించారు. 

  • బీఆర్ఎస్ నేతల అధిపత్య పోరు.. ముదిరాజ్ సంఘంలో విబేధాలు..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, రాజకీయ అధిపత్యం కోసం గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సమాచారం. రాజన్నసిరిసిల్ల జిల్లా ముఖ్య నేత ప్రతిదాంట్లో కల్పించుకోని.. కులసంఘాల ఎన్నికల్లో సైతం అజాయాయిషి కోసం ప్రయత్నాలు చేయడంలో అసలుకే మోసం అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో కూడా రాజకీయ అధికపత్యం కోసం.. నేతల మధ్య విబేధాలతో మంచి వాతవరణంను కలుషితం చేస్తున్నరన్న చర్చ నడుస్తుంది. సిరిసిల్ల మైనార్ట సంఘం ఎన్నిలకల నుంచి నేడు ముదిరాజ్ సంఘం కమిటి వరకు నేతల ప్రమేయంతోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగే స్థాయికి వెళ్లాయి. పోలీసులు కాస్తా అప్రమత్తంగా వ్యవహరించడంతో గొడవ సద్దుమనిగింది. లేకపోతే ఆ నేత తీరుతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగే పరిస్థితి ఏర్పడిందని సిరిసిల్ల లో చర్చ నడుస్తుంది.

  • చొప్పరి రామచంద్రం వెనక.. కేటీఆర్ బంధువు..?

రాజన్నసిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ సహాకార సంఘం అడ్హాక్ కమిటి ఎన్నికల్లో తమ వర్గీయులను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడానికి ఇద్దరు నేతలు తెరవెనక ప్రయత్నాలు చేసినట్లు తెలసింది. యామ తిరుపతి వెనక సిరిసిల్ల బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేత ఉండగా.. ఇల్లంతకుంట అనంతారం గ్రామానికి చెందిన చొప్పరి రామచంద్రం వెనక మంత్రి కేటీఆర్ బంధువు ఉన్నట్లు విశ్వసనీయం సమాచారం. మొదటి ఈ ఎన్నిక తేదిని జిల్లా ముఖ్య నేత వాయిదా వేయించగా.. రామచంద్రం వర్గీయులు మంత్రి కేటీఆర్ బంధువును కలవగా.. శుక్రవారం ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు వాయిదా పడకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా యాదగిరి గుట్టకు రామచంద్రం కు సంభదించిన సభ్యులను మంత్రి కేటీఆర్ బంధువే క్యాంపుకు పంపించినట్లు తెలిసింది. రామచంద్రం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. మంత్రి కేటీఆర్ బంధువుకు అతిసన్నిహితులు వచ్చి శాలువతో సత్కరించడం కొసరమెరుపు. ఏది ఏమైన సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘంలో చీలీకలు బీఆర్ఎస్పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయంగా చర్చిస్తున్నారు.