బీసీ గణన కోసం అర్ధనగ్న ప్రదర్శన

బీసీ గణన కోసం అర్ధనగ్న ప్రదర్శన

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టాలని కోరుతూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహం ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం బీసీ సంఘాల నేతలు ఒంటికై అంగీలు తొలగించి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జననగణన లో ప్రత్యేకంగా బీసీ గణన చేపట్టాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చట్ట సభలలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ గణన చేస్తేనే దేశంలో బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని అన్నారు. 60 శాతం  జనాభా ఉన్న బీసీలకు మేలు చేయడానికి కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. దేశంలోని 27 రాజకీయ పార్టీలు బీసీ గణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చాయని గుర్తు చేశారు. తొమ్మిది రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సులు చేశాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేసి బీసీలకు న్యాయం చేయాలని బీసీ నేతలు విజ్ఞాప్తి చేశారు.