తిరుమలలో మే నెలలో జరిగే ఉత్సవాలు

తిరుమలలో మే నెలలో జరిగే  ఉత్సవాలు

ముద్ర,తిరుపతి:- తిరుమలలో వచ్చే నెల లో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. మే 3న భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం, 4న‌ సర్వ ఏకాదశి, 10న అక్షయతృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి, 23న అన్నమాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.