రైతులకు నష్టపరిహారం అందించాలి.

రైతులకు నష్టపరిహారం అందించాలి.

బిజెపి జగిత్యాల నియోజక వర్గ నాయకుడు తిరుపతి రెడ్డి.
సారంగాపూర్ ముద్ర:
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని జగిత్యాల నియోజకవర్గం పొన్నాల తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి సారంగాపూర్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ తో కలిసి మంగళవారం సారంగాపూర్ మండలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా వంట వరి పంట  నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున, మామిడి రైతులకు ఎకరానికి 80 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట కిసాన్ మూర్చ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, సంతోష్ ,వేణు ,రామ్ రెడ్డి, నక్క జీవన్ ,మహేష్ ,అఖిల్ ,రాజు ఉన్నారు.