నూతన జిల్లా జడ్జి రాజగోపాల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ 

నూతన జిల్లా జడ్జి రాజగోపాల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ 

ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తి గౌతం ప్రసాద్ ని సన్మానించిన ఎస్పీ , DSP లు.

సూర్యాపేట జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజగోపాల్ ని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారం జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసినారు. ఈ సందర్భంగా కోర్టు క్యాలండర్, న్యాయశాఖ, పోలీసు శాఖ సమన్వయం, శిక్షల అమలు మొదలగు అంశాల గురించి ఇరువురు చర్చించారు. 

పోలీసు పని విధానం, ఎన్ఫోర్స్మెంట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని జడ్జి గారికి తెలిపినారు, కేసుల నమోదు, నేర అభియోగ పత్రాలను సకాలంలో కోర్టుకు అందజేస్తున్నాము, సాక్షులను, బాధితులను, నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరుస్తున్నాము  అని ఎస్పీ  జడ్జి గారికి వివరించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ సమన్వయం తో పని చేయాలని జడ్జి గారు ఈ సందర్భంగా కోరినారు.

ఉద్యోగవిరమణ పొందిన జిల్లా జడ్జి గౌతం ప్రసాద్ ని జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ  సన్మానించారు. జిల్లా కోర్టుకు జడ్జిగా జిల్లాలో సుదీర్ఘకాలం సేవలు అందించారని కొనియాడారు.

ఈ కార్యక్రమం నందు ఎస్పీ గారి వెంట DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, DCRB DSP రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కోర్టు లైజన్ ఆఫీసర్స్, సిబ్బంది ఉన్నారు.